కరణ్ జోహార్ తో ఎన్టీఆర్ భేటీ

Update: 2024-04-10 10:15 GMT

ఎన్టీఆర్ హీరో గా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా దేవర. ఆలశ్యం అయినా సరే అదరగొడతాం అంటూ తాజాగా ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు అయన ఫ్యాన్స్ లో మరింత జోష్ నింపాయనే చెప్పాలి. దసరా పండగ సందర్భంగా ఈ సినిమా ను అక్టోబర్ 10 న ప్రేక్షకుల ముందుకు తెస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా అత్యంత కీలక మైన హిందీ మార్కెట్ టార్గెట్ గా ఇప్పటికే చిత్ర యూనిట్ ఏర్పాట్లు ప్రారంభించింది. ఉత్తర భారత దేశంలో దేవర విడుదల కోసం హీరో ఎన్టీఆర్ తో పాటు దర్శకుడు కొరటాల శివ లు దేశంలోనే డైనమిక్ డిస్ట్రిబ్యూటర్స్ అయిన కరణ్ జోహార్, ఏఏ ఫిలిమ్స్ తో ఒప్పందం చేసుకున్నారు.

                                    వీళ్ళతో భేటీ అయిన ఫోటో లను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. ఇందులో కరణ్ జోహార్ తో పాటు ఎన్టీఆర్, కొరటాల శివ తదితరులు ఉన్నారు. కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ పేరుతో సినిమా లు డిస్ట్రిబ్యూట్ చేసే విషయం తెలిసిందే. అలాగే ఏఏ ఫిలిమ్స్ కూడా మరో ప్రముఖ సంస్థ. దేవర సినిమా రెండు భాగాలుగా రానుంది. ఈ సినిమా లో ఎన్టీఆర్ కు జోడిగా జాన్వీ కపూర్ తో పాటు మరాఠి నటి శృతి మరాఠే కూడా నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News