రాజధాని అంశంతో మాకు సంబంధం లేదు

Update: 2020-08-19 11:43 GMT

కేంద్రం మరోసారి క్లారిటీ ఇఛ్చేసింది. రాష్ట్రాల రాజధానుల విషయంలో తాము జోక్యం చేసుకోమని..ఇది ఆయా ప్రాంతాలకు సంబంధించిన అంశం అని స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఏపీ సర్కారు తీసుకున్న మూడు రాజధానులు, సీఆర్ డీఏ రద్దు నిర్ణయాలపై దోనె సాంబశివరావు అన్న వ్యక్తి వేసిన పిటీషన్ కు సంబంధించి జారీ అయిన నోటీసులకు కేంద్రం ఈ సమాధాన ఇచ్చింది. కేంద్ర హోం శాఖ అండర్ సెక్రటరి లలిత ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేశారు.

2014 ఏప్రిల్ 23న అప్పటి ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఎంపిక చేసుకుందని..పునర్విభజన చట్టంలోని సెక్షన్ 94 ప్రకారం రాజధాని అభివృద్ధికి కేంద్రం నిధులు విడుదల చేసిందని తెలిపారు. రాష్ట్ర సమగ్ర ప్రాంతాల అభివృద్ధి 2020 చట్టం విషయాన్ని రాష్ట్రం కేంద్రం దృష్టికి తీసుకురాలేదని..ఇలా చట్టం చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉందని తెలిపారు.

Similar News