ఈశ్వరయ్య టేపులపై సుప్రీం మాజీ జడ్జితో నిజనిర్ధారణ

Update: 2020-08-13 13:34 GMT

ఏపీ ఉన్నతవిద్యా నియంత్రణా,పర్యవేక్షణా కమిటీ ఛైర్మన్, మాజీ జడ్జి ఈశ్వరయ్య ఆడియో టేపుల వ్యవహారంపై హైకోర్టు గురువారం నాడు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ టేపులను జడ్జి రామకృష్ణ హైకోర్టుకు అందజేయగా..ఈ సంభాషలను నిజనిర్ధారణను చేసే బాధ్యతను సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి రవీంద్రన్ కు బాధ్యతలు అప్పగించింది. ఈ వ్యవహారంలో అవసరం అయితే సీబీఐ, కేంద్ర విజిలెన్స్ విభాగాల సహకారం తీసుకోవాలని హైకోర్టు కోరింది. సాధ్యమైనంత త్వరగా నివేదిక అందజేయాలని ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేశారు. హైకోర్టు ఉన్న ప్రాంతాన్ని రెడ్ జోన్ గా ప్రకటించాలని, హైకోర్టు ఇన్ ఛార్జి రిజిస్టార్ జనరల్ రాజశేఖర్ మృతిపై విచారణ జరిపించాలని కోరుతూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యుడు లక్ష్మీనర్సయ్య హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.

ఈ వ్యాజ్యంపై జడ్జి రామకృష్ణ ఇంప్లీడ్ పిటీషన్ వేశారు. అందులోనే రామకృష్ణ హైకోర్టు న్యాయమూర్తులపై జస్టిస్ ఈశ్వరయ్య ఆరోపణలు చేశారని..దీనికి సంబంధించిన తన దగ్గర ఉన్న ఆడియోను కోర్టుకు సమర్పించారు. దీంతో ఈ ఆడియోపై నిజనిర్ధారణకు సుప్రీంకోర్టు రిటైర్డు న్యాయమూర్తి రవీంద్రన్ ను నియమించారు. ఈ ఆడియో సంభాషణలు మీడియాలో ప్రముఖంగా రావటం..దీనిపై స్పందించిన జస్టిస్ ఈశ్వరయ్య తాను రామకృష్ణతో ఫోన్ లో మాట్లాడింది నిజమేనని..అయితే తన వాయిస్ ట్యాంపరింగ్ చేశారని..సరిగా ఇవ్వలేదని మీడియా ముందు ప్రకటించారు. తాజాగా హైకోర్టు ఈ టేపులపై విచారణకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తికి అప్పగించటంతో ఈ వ్యవహారం కొత్త మలుపు తిరిగినట్లు అయింది.

Similar News