చంద్రబాబు కు ఏపీ డీజీపీ లేఖ

Update: 2020-08-17 16:49 GMT

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు చేసిన టెలిఫోన్ ట్యాపింగ్ ఆరోపణల అంశంపై ఏపీ డీజీపీ గౌతంసవాంగ్ స్పందించారు. చంద్రబాబు ప్రధాని నరేంద్రమోడీకి రాసిన లెటర్ కు మీడియాలో విస్తృతమైన కవరేజ్ వచ్చిందని..ఆ లేఖలో ప్రతిపక్షాలతోపాటు లాయర్లు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తల ఫోన్లు ట్యాప్ చేస్తూ ప్రజాస్వామ వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నట్లు ఆరోపించిన అంశాలపై డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆ లేఖలో స్పందించారు. ‘మీరు ఆరోపించినట్లుగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ణానంతో ట్యాపింగ్ చేస్తున్నట్లు ఏ వర్గం నుంచి కూడా ఇఫ్పటివరకూ ఫిర్యాదు అందలేదు.

ఆరోపణలు చాలా తీవ్రమైనవి అయినందున 1885 ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్, ఇన్పర్ మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 ల ప్రకారం చట్టబద్దంగా చర్యలు తీసుకునేందుకు వీలుగా ఆధారాలు సమర్పించండి. రాజ్యాంగబద్దమైన, చట్టబద్దమైన హక్కులను రక్షిస్తామని మరోసారి పునర్ఘాటిస్తున్నా. ప్రజల హక్కులను కాపాడేందుకు, రూల్ ఆఫ్ లా అమలు చేసేందుకు సహకరించాలని కోరుకుంటున్నా’ అని డీజీపీ తన లేఖలో పేర్కొన్నారు.

 

Similar News