ఏపీ బిజెపి అధ్యక్షుడుగా సోము వీర్రాజు

Update: 2020-07-27 16:05 GMT

కన్నా లక్ష్మీనారాయణకు షాక్. బిజెపి అధిష్టానం ఆయన్ను ఏపీ బిజెపి అధ్యక్ష పదవి నుంచి తప్పించి..కొత్తగా ఆ బాధ్యతలను ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు అప్పగించింది. కన్నా లక్ష్మీనారాయణ తనకు మరోసారి రెన్యువల్ వస్తుందని గట్టిగా ఆశించారు. కానీ ఆయన ఆశలు ఏమీ ఫలించలేదు. ఏపీ బిజెపి అధ్యక్షుడిగా సోము వీర్రాజు నియామం తక్షణమే అమల్లోకి వస్తుందని బిజెపి జాతీయ అధ్యక్షుడు జె పి నడ్డా సోమవారం రాత్రి జారీ చేసిన తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ముఖ్యంగా చంద్రబాబునాయుడి హయాంలో సోము వీర్రాజు చాలా దూకుడుగా వ్యవహరించారు.

మరి ఇఫ్పుడు ఆయన వ్యవహారశైలి ఎలా ఉంటుందనేది కాలమే నిర్ణయించాలి. ఎందుకంటే ఏపీ బిజెపిలో రకరకాల గ్రూపులు ఉన్నాయనే ప్రచారం బహిరంగ రహస్యం. గత కొంత కాలంగా కన్నా లక్ష్మీనారాయణ అధికార వైసీపీపై విమర్శలు చేసే విషయంలో చాలా దూకుడుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. వైసీపీ కూడా అదే స్థాయిలో కౌంటర్ ఎటాక్ చేస్తోంది. తాజా మార్పులతో ఏపీ బిజెపిలో ఎన్ని కొత్త పరిణామాలు చోటుచేసుకుంటాయో వేచిచూడాల్సిందే.

Similar News