సంక్షేమం ఒక్కటే చాలదు..జీవించే స్వేచ్చ కూడా ఉండాలి

Update: 2020-07-25 15:07 GMT

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రతిపక్ష నేతల కంటే వేగంగా స్పందిస్తున్నారు. సర్కారు తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంశం మొదలుకుని పలు అంశాలపై ఆయన ప్రభుత్వ తీరును తప్పుపడుతున్నారు. శనివారం నాడు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సన్నిహితుడు నలంద కిషోర్ మరణంపై స్పందించారు. ఇది పోలీసులు చేసిన హత్య అని ఆరోపించారు. సోషల్ మీడియాలో ఎవరో పెట్టిన పోస్టును షేర్ చేశారనే కారణంతో ఆయన్ను విశాఖపట్నంలో అరెస్ట్ చేసి కర్నూలుకు తీసుకెళ్లారని..ఆ సమయంలో కర్నూలులో కరోనా తీవ్రంగా ఉందని తెలిపారు.

అక్కడ ఆయనకు కరోనా సోకి మృత్యువాత పడ్డారని..ఇది చాలా బాధాకరమన్నారు. రాష్ట్రంలో సంక్షేమం ఒక్కటే చాలదని..ప్రజలకు జీవించే స్వేచ్చ కూడా ఉండాలన్నారు. సుప్రీం ఆదేశాల తర్వాత కూడా రమేష్ కుమార్ కు పోస్టింగ్ ఇఛ్చే ఆలోచనలో ఏపీ సర్కారు లేదని తనకు సమాచారం వస్తోందని తెలిపారు. జస్టిస్ కనగరాజ్ సుప్రింకోర్టులో పిటిషన్ వేయవచ్చని తెలుస్తోందని ఆయన అన్నారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు సాక్షిలో ఎందుకు రాలేదని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగ వ్యవస్థలను కాలరాయడం సరికాదని ఆయన అన్నారు.

Similar News