జగన్ కు ముద్రగడ లేఖ

Update: 2020-07-03 05:08 GMT

కాపు రిజర్వేషన్ల అంశంపై మరోసారి ముద్రగడ పద్మనాభం గళం విప్పారు. ఆయన శుక్రవారం ఇదే అంశంపై ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. దయచేసి మా జాతి సమస్య తీర్చమని భారత ప్రధాని నరేంద్రమోడీని కోరమని మనస్పూర్తిగా కోరుతున్నట్లు లేఖలో ప్రస్తావించారు. ‘ మీ విజయానికి మా జాతి సహకారం కొన్ని చోట్ల తప్ప మీరు పొందలేదా?. ఎన్నికలు జరిగిన అన్ని రోజుల్లో ఇంచుమించుగా ప్రతి రోజు అప్పటి ముఖ్యమంత్రి మా జాతిని, ఉద్యమాన్ని పోలీసులతో చేయించిన దమనకాండ, అరాచకాలు, అవమానాలు మీ చానెల్ లో చూపించినవే చూపించి మా జాతి సానుభూతి, ఓట్లు పొందలేదా?. పాలకులు ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకోవాలి.

ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, అప్పటి పశ్చిమ బెంగాల్ సీఎం దివంగత జ్యోతిబసు, దివంగత రాజశేఖరరెడ్డిలాగా పూజలందుకోవాలే కానీ పదవి మూణ్ణాళ్ల ముచ్చటగా చేసుకోకండి. అడిగిన వారికి, అడగని వారికి దానాలు చేసి దానకర్ణుడు అనిపించుకుంటున్నారు. మా జాతి చిరకాల కోరిక పొగొట్టుకున్న బిసి రిజర్వేషన్ల కోసం చేసిన పోరాటానికి మీ అనుమతితో మీ పార్టీ నేతలు పూర్తి మద్దతు ఇఛ్చారు. అసెంబ్లీలో కూడా మద్దతు ఇచ్చారని విన్నాను. ఈ రోజు మా కోరికను దానం చేయటానికి మీకు చేతులు ఎందుకు రావటం లేదండి’ అని ప్రశ్నించారు.

Similar News