వైఎస్ కు సీఎం జగన్ ఘన నివాళి

Update: 2020-07-08 06:05 GMT

ఏపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం నాడు ఇడుపులపాయలో దివంగత నేత వైఎస్ రాజశేఖరెడ్డికి ఘనంగా నివాళులు అర్పించారు. వైఎస్ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. వైఎస్సార్‌ 71వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో జగన్ తోపాటు వైఎస్‌ రాజశేఖరరెడ్డి సతీమణి విజయమ్మ, వైఎస్‌ భారతి రెడ్డి, వైఎస్‌ షర్మిల, బ్రదర్‌ అనిల్‌ కుమార్‌, ఎంపీ వైఎస్‌ అవినాష్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రాజశేఖర్ రెడ్డికి నివాళి అర్పించిన అనంతరం "నాలో.. నాతో వైఎస్సార్‌" పుస్తకాన్ని ముఖ్యమంత్రి జగన్‌ ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని వైఎస్‌ విజయమ్మ రచించారు. వైఎస్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం రైతు దినోత్సవంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. అంతకు ముందు జగన్ వైఎస్ గురించి ట్విట్టర్ లో ఓ పోస్టు పెడుతూ రాజశేఖరరెడ్డి మరణంలేని మహానేత అని పేర్కొన్నారు. 104,108, ఆరోగ్య, ఫీజు రీఎంబర్స్ మెంట్, ఉచిత విద్యుత్, జలయజ్ణం వంటి పథకాలతో ప్రజల దృష్టిలో ఆయన ఇంకా జీవించే ఉన్నారని తెలిపారు.

Similar News