ఆ బిల్లులు ఆమోదించొద్దు

Update: 2020-07-19 07:24 GMT

ఏపీ నూతన రాజధాని అమరావతి కోసం రైతులు 33 వేల ఎకరాలు ఇఛ్చారని..ప్రభుత్వం దీనిపై ఇప్పటికే పది వేల కోట్ల రూపాయల వ్యయం చేసిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు తెలిపారు. దీంతోపాటు రాజధాని అంశం ప్రస్తుతం హైకోర్టులో పెండింగ్ లో ఉన్నందున సీఆర్ డీఏ రద్దు, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లులను ఆమోదించవద్దని కోరుతూ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ కు ఆదివారం నాడు చంద్రబాబునాయుడు సుదీర్ఘ లేఖ రాశారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అని పేర్కొన్నారు. ప్రస్తుతం అసెంబ్లీ ఆమోదించిన బిల్లులు పునర్విభజన చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాయన్నారు. పైగా మూడు రాజధానులు అనటం వల్ల ఏపీ సర్కారుపై ఆర్ధిక భారం ఎక్కువ పడుతుందని తెలిపారు.

రాజధాని నగరం అమరావతి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుండి సమాన దూరంలో ఉంటుంది, తద్వారా ఈ ప్రాంతం రాజధాని నగరానికి అత్యంత సానుకూల ప్రాంతంగా మారుతుంది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014, సెక్షన్ 94 (3) ప్రకారం, రాజ్ భవన్, హైకోర్టు, ప్రభుత్వ సెక్రటేరియట్, లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్, ఇతర అవసరమైన మౌలిక సదుపాయాలతో సహా ఆంధ్రప్రదేశ్ యొక్క ‘‘నూతన రాజధానిలో’’ అవసరమైన సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని అందించాల్సి ఉందన్నారు. ఈ అంశాలు అన్నింటిని పరిగణనలోకి బిల్లుల విషయంలో నిర్ణయం తీసుకోవాలన్నారు.

 

Similar News