పారిశ్రామికవేత్తలకు మానవ వనరులూ అందిస్తాం

Update: 2020-06-04 08:26 GMT

ఏపీ సర్కారు నూతన పారిశ్రామిక విధానంపై దృష్టి పెట్టింది. అందులో పారిశ్రామికవేత్తలకు ఎంతో అనువైన వాతావరణం కల్పించబోతున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి తెలిపారు. గురువారం మంత్రి నేతృత్వంలో ఇండస్ట్రియల్ టాస్క్‌ ఫోర్స్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో నూతన పారిశ్రామిక విధానం పై చర్చించారు. నాలుగు రంగాల్లో ప్రాధాన్యం ఇచ్చేలా పాలసీ రూపొందిస్తామని తెలిపారు. పరిశ్రమలకు 30 రోజుల్లో అనుమతులు ఇచ్చే విధానం తీసుకువస్తామని మంత్రి పేర్కొన్నారు.

పరిశ్రమలకు స్థలం, వాటర్, పవర్‌, స్కిల్ మ్యాన్ పవర్ కూడా అందిస్తామని చెప్పారు. రాష్ట్రంలో అన్ని వనరులను సమర్థవంతంగా వినియోగిస్తామని తెలిపారు. ఎలాంటి అవినీతికి ఆస్కారం లేని పారిశ్రామిక పాలసీ ని తీసుకొస్తున్నామని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో పారిశ్రామిక రంగంలో పెట్టుబడులు, ఉద్యోగాల తో పాటు పర్యావరణానికి ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు.

Similar News