తెలంగాణ అంతటా అవతరణ ఉత్సవాలు

Update: 2020-06-02 05:06 GMT

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రమంతటా ఉత్సవాలు సాగాయి. కరోనా కారణంగా ఈ సారి అత్యంత సాదాసీదాగా ఈ ఉత్సవాలు జరిగాయి. ముఖ్యమంత్రి కెసీఆర్ మంగళవారం ఉదయమే గన్ పార్కు వద్ద అమరులకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. ఆ తర్వాత కెసీఆర్ రాజ్ భవన్ కు చేరుకుని గవర్నర్ తమిళ్ సై కి రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలతోపాటు ఆమె పుట్టిన రోజు సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలిపారు. అసెంబ్లీలో పోచారం శ్రీనివాసరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల్లో పాల్గొన్నారు.

రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోడీ తదితరులు తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోడీ ఈ మేరకు తెలుగులో ట్వీట్ చేశారు. ‘తెలంగాణ ప్రజలకు రాష్ట్రావతరణ దినోత్సవ శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రజలు ఎన్నో క్షేత్రాల్లో తమ ప్రతిభను చాటుతున్నారు. దేశ ప్రగతిలో ఈ రాష్ట్ర ముఖ్యభూమిక పోషిస్తోంది. తెలంగాణ ప్రజల అభ్యున్నతికి, శ్రేయస్సుకై నేను ప్రార్ధిస్తున్నాను’ అని పేర్కొన్నారు. రాష్ట్రంలోని మంత్రులు ఎవరి జిల్లాల్లో వారు జెండా ఆవిష్కరణల్లో పాల్గొన్నారు.

 

Similar News