నూతన ఎంపీలకు సీఎం జగన్ అభినందనలు

Update: 2020-06-19 16:33 GMT

రాజ్యసభ కు కొత్తగా ఎన్నికైన ఎంపీలు శుక్రవారం సాయంత్రం తాడేపల్లిలో సీఎం జగన్మోహన్ రెడ్డితో సమావేశం అయ్యారు. ఈ ఎంపీలకు జగన్ అభినందనలు తెలిపారు. ఎంపీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానిలకు శుభాకాంక్షలు తెలుపుతూ సీఎం వైఎస్‌ జగన్‌ ట్విటర్‌లో ఓ సందేశాన్ని పోస్ట్‌ చేశారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను వినిపించడానికి వారితో కలిసి పనిచేయడానికి తాను ఎదురు చూస్తున్నట్టు సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. శుక్రవారం నాడు జరిగిన ఎన్నికలో నాలుగు సీట్లను వైసీపీ దక్కించుకున్న విషయం తెలిసిందే.

Similar News