‘వందే భారత్’ విమానంలో ప్రయాణికుడి మృతి

Update: 2020-06-14 14:55 GMT

విదేశాల్లో చిక్కుకుపోయిన ప్రయాణికులను దేశానికి తెప్పించే ప్రక్రియలో భాగంగా కేంద్రం ‘వందే భారత్’ మిషన్ చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నైజీరియా లోని లాగోస్ నుంచి ముంబయ్ కు విమానం చేరుకుంది. శనివారం రాత్రి ఏడు గంటలకు బయలుదేరి ఈ విమానం ఆదివారం ఉదయం 3.45 గంటలకు ముంబయ్ కు చేరుకుంది. ఈ సమయంలో విమానంలో ఉన్న ఓ 42 సంవత్సరాల ప్రయాణికుడు కుప్పకూలిపోయాడు. విమానంలో ఉన్న వైద్యులు చేసిన ప్రయత్నాలు ఏమీ ఫలించలేదు.

అతను విమానంలోనే తుది శ్వాస విడిచాడు. అయితే ఇది సాదారణ మరణమే అని ఎయిర్ ఇండియా చెబుతోంది. అయితే సదరు ప్రయాణికుడు శ్వాస తీసుకోవటంలో చాలా ఇబ్బంది పడ్డాడని చెబుతున్నారు. తర్వాత ప్రయాణికుడి కుటుంబ సభ్యులకు అధికారులు సమాచారం చేరవేశారు. తాజా ఘటనతో వందే బారత్ మిషన్ లో భాగంగా ప్రయాణికులు తీసుకొచ్చే సమయంలో చేసే పరీక్షలపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Similar News