‘ఆ ఫీలింగ్ ను’ ఏదీ మ్యాచ్ చేయలేదు

Update: 2020-05-18 07:07 GMT

‘నిశ్సబ్దం’. అనుష్క శెట్టి, మాధవన్, అంజలి కీలక పాత్రలు పోషించిన సినిమా. కరోనా దెబ్బకు ఏప్రిల్ లో విడుదల కావాల్సిన ఈ సినిమా అన్ని సినిమాల్లాగానే వాయిదా పడింది. థియేటర్లు ఎప్పుడు తెరుస్తారు..తెరిచినా ప్రేక్షకులు వెంటనే సినిమాలు చూడటానికి వస్తారా? వంటి అనుమానాలు ఎన్నో పరిశ్రమ పెద్దలను వేధిస్తున్నాయి. ఈ తరుణంలో నిశ్శబ్దం సినిమా ఓటీటీలో విడుదల చేసేందుకు రంగం సిద్ధం అయింది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తూనే ఉన్నాయి. చిత్ర యూనిట్ ఇప్పటికే ఈ విషయంలో ఓ సారి క్లారిటీ ఇఛ్చినా ఆ వార్తలు మాత్రం ఆగటం లేదు. దీనిపై చిత్ర నిర్మాత కోన వెంకట్ ఓ ట్వీట్ చేశారు.

అదేంటో ఓ సారి చూడండి. ‘ మేం తీసిన సినిమా చూసి థియేటర్ లో ప్రేక్షకులు ఇచ్చే రియాక్షనే మాకు ప్రేరణ. ఆక్సిజన్. ఆ ఫీలింగ్ ను ఏదీ మ్యాచ్ చేయలేదు. సినిమా ఉన్నది హాళ్ళ కోసమే. అదే మా ప్రాధాన్యం’ అని పేర్కొన్నారు. దీంతో నిశ్శబ్దం మూవీ ఓటీటీ ద్వారా విడుదల చేస్తున్నారనే పుకార్లకు తెరపడినట్లు అయింది. సినిమా పట్ల తమకు అమితమైన ఆసక్తి, ప్రేమతోనే పరిశ్రమలోకి అడుగుపెట్టామని కోన వెంకట్ ట్వీట్ లో పేర్కొన్నారు. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్నామని తెలిపారు.

 

 

Similar News