జియోలోకి మరో 11,367 కోట్ల రూపాయల పెట్టుబడి

Update: 2020-05-22 04:49 GMT

రిలయన్స్ జియో సంచలనాలు నమోదు చేస్తోంది. వరస పెట్టి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు సాధిస్తోంది.కరోనా కష్టకాలంలోనూ ఈ కంపెనీలోకి ఇంత భారీ ఎత్తున పెట్టుబడులు రావటం ఆసక్తికరంగా మారింది. తాజాగా జియో ఫ్లాట్ ఫామ్స్ లో కెకెఆర్ 11,367 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఇది కంపెనీలో 2.32 శాతం వాటాకు సమానం. ఆసియాలో కెకెఆర్ అతి పెద్ద పెట్టుబడి కూడా ఇదే కావటం విశేషం. నెల రోజుల వ్యవధిలో జియో ఫ్లాట్ ఫామ్స్ 78,562 కోట్ల రూపాయల పెట్టుబడులను సాధించాయి.

ఫేస్ బుక్ తో మొదలుపెట్టి సిల్వర్ లేక్ పార్టనర్స్, విస్టా ఈక్విటీ పార్టనర్స్, జనరల్ అట్లాంటిక్ లు తాజాగా కెకెఆర్ ఇందులో పెట్టుబడి పెట్టాయి. దేశ డిజిటల్ సొసైటీ నిర్మాణానికి ఈ సంస్థల పెట్టుబడి ఎంతగానో ఉపయోగనుందని రిలయన్స్ జియో ఓ ప్రకటనలో తెలిపింది. రిలయన్స్ నెక్స్ట్ జనరేషన్ సాఫ్ట్ వేర్ ఉత్పత్తులు, ఫ్లాట్ ఫాంపై ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తున్నాయని పేర్కొన్నారు. రిలయన్స్ జియో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్, ఏఆర్/విఆర్, బిగ్ డేటా వంటి విభాగాల్లో కీలకపాత్ర పోషించనుందని తెలిపారు.

 

Similar News