కృష్ణాలో అలా నీళ్లు తీసుకోవటం ఎవరికీ నష్టం కాదు

Update: 2020-05-26 12:27 GMT

పోతిరెడ్డిపాడు విస్తరణ ప్రాజెక్టుపై ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి తన వైఖరిని స్పష్టం చేశారు. ‘శ్రీశైలంలో 881 అడుగులు ఉన్నప్పుడే 44 వేల క్యూసెక్కులు తీసుకోగలం. 854 అడుగుల్లో ఉంటే కేవలం 7వేల క్యూసెక్కులు మాత్రమే తీసుకోగలం. ఇలాంటి పరిస్థితుల్లో రాయలసీమ కరువు ఎలా తీర్చాలి? 800 అడుగుల నీటిమట్టం ఉన్నప్పుడు తెలంగాణ నీళ్లు తీసుకెళ్తోంది. అదే 800 అడుగుల వద్ద మాకు కేటాయించిన నీళ్లను తీసుకుంటాం. ఇలా తీసుకోవడం ఎవరికీ నష్టం కాదు. అప్పుడే రెండు రాష్ట్రాలకు సమన్యాయం జరుగుతుంది’ అని జగన్ వ్యాఖ్యానించారు. కొంత మంది కావాలని రాయలసీమ ప్రాజెక్టులను వివాదం చేస్తున్నారని ఆరోపించారు.దశాబ్ధకాలంలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది ఆహారధాన్యాల దిగుబడి పెరిగిందనని, ఏడాదికాలంలో . ఆహారధాన్యాల దిగుబడి 150 లక్షల నుంచి మెట్రిక్‌ టన్నుల నుంచి 172 లక్షల మెట్రిక్‌ టన్నులకు చేరిందని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

వ్యవసాయం, అనుబంధ రంగాలపై ఏర్పాటు చేసిన ‘మన పాలన-మీ సూచన ’ కార్యక్రమంలో జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా జలవనరుల శాఖలో రూ.1,095 కోట్లు ఆదా చేశాం. ప్రాధాన్యతక్రమంలో సాగునీటి ప్రాజెక్ట్‌ లను పూర్తి చేస్తాం. 2021 చివరికల్లా పోలవరం ప్రాజెక్ట్‌ ను పూర్తి చేస్తాం. కరోనా కారణంగా కూలీలు సొంత రాష్ట్రాలకు వెళ్ళటంతో పనులు కొంత స్లో అయ్యాయి. అయినా సరే స్పీడ్ పెంచి చెప్పిన ప్రకారం ప్రాజెక్టు పూర్తి చేస్తాం. చంద్రబాబుతోనే కాదు.. ఈనాడు, ఏబీఎన్‌, టీవీ-5 వంటి, చెడిపోయిన వ్యవస్థలపై కూడా యుద్ధం చేస్తున్నాం.’ అని పేర్కొన్నారు.

Similar News