టీటీడీలో ఆ ఉద్యోగులను తొలగించొద్దు

Update: 2020-05-02 15:31 GMT

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో పనిచేస్తున్న 1400 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బందిని తొలగించటాన్ని జనసేన అధినేత పవన్ కళ్యణ్ ఆక్షేపించారు. టీటీడీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన కోరారు. కరోనా కారణంగా ఆల్పాదాయ వర్గాల ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్న ఈ తరుణంలో టీటీడీ నిర్ణయం సరికాదని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

కరోనా సంక్షోభ సమయంలో ఉద్యోగాలు తొలగించొద్దని ప్రధాని మోడీ చెబుతుంటే ఒక్క కలం పోటుతో 1400 మందిని తప్పించటం సరికాదన్నారు. ఇలా తొలగించబడిన వారంతా 15 సంవత్సరాలుగా అక్కడే పనిచేస్తూ అతి తక్కువ వేతనాలు పొందుతున్నారని తెలిపారు. టీటీడీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని..ప్రభుత్వం కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని పవన్ కళ్యాణ్ కోరారు.

 

Similar News