ఎల్ జీ పాలిమర్స్ బాధితులకు చెక్కుల పంపిణీ

Update: 2020-05-11 09:06 GMT

ఎల్ జీ పాలిమర్స్ లో జరిగిన ప్రమాద ఘటనతో రాష్ట్రంలో పారిశ్రామిక భద్రతకు సంబంధించిన నూతన విధానం తెచ్చేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని మంత్రి కె. కన్నబాబు తెలిపారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, కన్నబాబు, అవంతి శ్రీనివాస్ లు సోమవారం నాడు విశాఖపట్నంలో గ్యాస్ లీక్ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాల కోటి రూపాయల నష్టపరిహారం చెక్కులను అందజేశారు. ఒక్కో కుటుంబానికి కోటి రూపాయల లెక్కన బాధిత కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేశారు.

క్షతగాత్రులకు నష్టపరిహారం మంగళవారం నుంచి అందజేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం గ్రామాల్లో గ్యాస్ ప్రభావం పూర్తిగా తొలగిపోయిందని..సీఎం ఆదేశాల మేరకు మంత్రులం కూడా ఒక్కో గ్రామంలో రాత్రి బస చేయనున్నట్లు వెల్లడించారు. గత ప్రభుత్వ తప్పిదాల వల్లే ఈ పరిస్థితి వచ్చిందని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఈ పరిశ్రమకు వైసీపీ సర్కారు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలోని ప్రమాదకర పరిశ్రమలపై విచారణ జరిపి..నివేదిక రాగానే చర్యలు చేపడతామని తెలిపారు.

 

 

 

Similar News