ఎంఎస్ఎంఈలకు పెద్ద పీట

Update: 2020-05-22 11:36 GMT

ప్రైవేట్ రంగంలో పెద్ద ఎత్తున ఉపాధి కల్పించే సూక్ష్మ, చిన్న,మధ్యతరహా (ఎంఎస్ఎంఈ) పరిశ్రమలకు పెద్ద పీట వేయనున్నట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ‘రీస్టార్ట్’ ప్యాకేజీ కింద ఈ రంగానికి రెండు దఫాలుగా 1100 కోట్ల రూపాయలు అందించనున్నారు. గత ప్రభుత్వహయాంలోని బకాయిలను కూడా చెల్లిస్తున్నామని, లాక్‌డౌన్‌ నేపథ్యంలో పరిశ్రమలు మూతపడి నష్టాల్లో ఉండటంతో విద్యుత్‌ ఛార్జీలు మూడు నెలల పాటు మాఫీ చేస్తున్నట్లు సీఎం వెల్లడించారు. పరిశ్రమలకు ఎలాంటి నైపుణ్యం గల కార్మికులు అవసరమో గుర్తించాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిన 827 కోట్ల రూపాయలతో పాటు మొత్తం రూ.905 కోట్ల ప్రోత్సాహకం అందించనుంది.

అంతేకాకుండా రూ.187 కోట్ల స్థిర విద్యుత్‌ చార్జీల మాఫీ చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. నిర్వహణ మూల ధనం రుణాలకు రూ.200 కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎంఎస్‌ఎంఈలకు కేవలం 6 నుంచి 8 శాతం వడ్డీకే రుణాలు ఇస్తామన్నారు. ప్రభుత్వ కొనుగోళ్లలో 25 శాతం ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈల నుంచే చేయాలని నిర్ణయించారు. అలా చేసిన కొనుగోళ్లకు 45 రోజుల్లో చెల్లింపులు చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం తాడేపల్లి క్యాంప్‌ ఆఫీస్‌లో చిన్న,మధ్య తరగతి పరిశ్రమల ప్రతినిధులతో సీఎం వైఎస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

Similar News