ఏపీలో స్ట్రీట్ ఫుడ్స్ కూ అనుమతి

Update: 2020-05-26 11:57 GMT

ఏపీ సర్కారు లాక్ డౌన్ కు సంబంధించి మరిన్ని సడలింపులు ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో రోడ్లపై ఆహార పదార్ధాలు అమ్మేవారితోపాటు గార్మెంట్, ఫుట్ వేర్, జ్యువెలరీ షాప్ లు తెరుచుకునేందుకు అనుమతి మంజూరు చేసింది. దీని కోసం కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. పెద్ద సంస్థలు కస్టమర్లు నేరుగా రావటం కాకుండా ఆన్ లైన్ లో అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని సూచించారు.

ప్రతి షాప్ లోకి వచ్చే కస్టమర్ వివరాలు అన్నీ నమోదు చేయాల్సి ఉంటుందని ఆదేశాల్లో పేర్కొన్నారు. కోవిడ్ లక్షణాలు ఉన్న వారిని షాపులోకి అనుమతించకూడదు. ప్రతి కౌంటర్ వద్ద శానిటైజర్ ను ఏర్పాటు చేయాలి. మాస్క్ లు లేకుండా ఎవరినీ అనుమతించకూడదు. ఏ షాపులోనూ ట్రయల్ ను అనుమతించకూడదు.

Similar News