ఫ్లిప్ కార్ట్..మేరూ ఒప్పందం

Update: 2020-04-29 13:30 GMT

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్, ప్రముఖ క్యాబ్ ఆపరేటర్ మేరూలు జట్టుకట్టాయి. కరోనా సంక్షోభ సమయంలో ప్రజలకు నిత్యావసరాలు అత్యంత సురక్షితంగా అందించేందుకు ఈ ఒప్పందం చేసుకున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సర్వీసులు హైదరాబాద్ తోపాటు ఢిల్లీ రాజధాని ప్రాంతం, బెంగుళూరుల్లో అందుబాటులోకి వచ్చాయి. ఓజోన్ శానిటైజ్డ్ క్యాబ్ ల ద్వారా ప్రజలకు నిత్యావసరాలు అందించనున్నట్లు తెలిపారు. ఈ సంక్షోభ సమయంలో తమ కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ ఒప్పందం చేసుకున్నట్లు ఫ్లిప్ కార్ట్ గ్రూప్ సీఈవో కళ్యాణ్ కృష్ణమూర్తి తెలిపారు.

మహీంద్రా అండ్ మహీంద్రాకు చెందిన మేరుతో భాగస్వామ్యం ద్వారా తమ కస్టమర్లకు మరింత విలువ జోడింపు సేవలు అందించవచ్చన్నారు. తమకు అత్యంత సురక్షితమైన సప్లయ్ చైన్ ఉందని తెలిపారు. తాము ఫ్లిప్ కార్ట్ తో కలసి వినూత్నంగా చేస్తున్న ఈ కార్యక్రమం వినియోగదారులకు ఎంతో మేలు చేయనుందని మేరూ మొబిలిటీ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఫౌండర్, సీఈవో నీరజ్ గుప్తా వ్యాఖ్యానించారు. నిర్దేశిత సమయంతో మేరూ తమ కస్టమర్లకు సేవలు అందిస్తుందని తెలిపారు.

Similar News