ఏపీ సర్కారు కీలక ఆదేశాలు

Update: 2020-04-03 14:32 GMT

ఏపీలో కరోనా అలజడి పెరిగిన తరుణంలో సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య సర్వీసులను అత్యవసర సేవల చట్టం (ఎస్మా) పరిధిలోకి తీసుకొస్తూ సర్కారు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం ఆరు నెలల పాటు అమల్లో ఉండనుంది. ఎవరైనా ఈ కీలక తరుణంలో వైద్య సేవలు అందించటానికి నిరాకరిస్తే వారిని శిక్షించే అధికారం కూడా సర్కారుకు దక్కనుంది. ఈ మేరకు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

వైద్య, పారిశుద్ధ్యం, వైద్య పరికరాల కొనుగోలు, నిర్వహణ, రవాణా సిబ్బంది,మంచినీరు, విద్యుత్ సరఫరా, భద్రతా సిబ్బంది, ఆహార సరఫరా, బయో మెడికల్ వ్యర్ధాల తరలింపు, మందుల కొనుగోలు, రవాణా, తయారీ, అంబులెన్స్ సర్వీసులను కూడా ఎస్మా పరిధిలోకి తెచ్చారు.

Similar News