ఏపీలో 303కు పెరిగిన కరోనా కేసులు

Update: 2020-04-06 13:34 GMT

ఏపీలో కరోనా కేసుల పెరుగుదల ఆందోళనకరంగానే ఉంది. గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున పాజిటివ్ కేసులు వస్తుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ జరిగిన పరీక్షల్లో కొత్తగా మరో 37 కేసులు వెలుగు చూశాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 303కి పెరిగింది. సోమవారం ఉదయమే మరో 14 కేసులను ప్రకటించారు. అంటే ఒక్క రోజులోనే ఏపీలో సాయంత్రం ఆరు గంటల వరకూ 51 కేసులు నమోదు అయినట్లు అయింది.

కొత్తగా కర్నూలులో 18, నెల్లూరులో 8,పశ్చిమ గోదావరిలో ఐదు, కడపలో నాలుగు, కృష్ణ, ప్రకాశం జిల్లాల్లో ఒక్కో కేసు నమోదు అయ్యాయి. కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏకంగా 74కు పెరిగింది. నెల్లూరులో 42 కేసులు, గుంటూరులో 32 కేసులు, కృష్ణాలో 29, కడపలో 27, చిత్తూరులో 17, ప్రకాశంలో 24, విశాఖపట్నంలో 20, అనంతపురంలో 7, తూర్పుగోదావరిలో 11,పశ్చిమ గోదావరిలో 21 కేసులు నమోదు అయ్యాయి.

 

 

Similar News