కరోనాపై పోరుకు టాటా ట్రస్ట్, టాటా సన్స్ విరాళం 1500 కోట్లు

Update: 2020-03-28 11:47 GMT

దేశంలోని ప్రముఖ పారిశ్రామిక సంస్థ అయిన టాటా గ్రూప్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. కరోనాపై పోరుకు టాటా ట్రస్ట్ర్ తరపున 500 కోట్ల రూపాయలను కేటాయించినట్లు ప్రకటించింది. ఈ మేరకు రతన్ టాటా ట్వీట్ చేశారు. ప్రపంచానికి సవాల్ విసిరిన కరోనా ను ఎదుర్కొనేందుకు తాము సిద్ధమే అన్నారు. అయితే ఈ మొత్తం 500 కోట్ల రూపాయలను ఎలా ఖర్చు చేయనున్నది కూడా రతన్ టాటా వెల్లడించారు. తాజాగా టాటా సన్స్ వెయ్యి కోట్ల రూపాయల విరాళం ప్రకటించింది. దీంతో టాటా గ్రూప్, టాటా ట్రస్ట్ కరోనాపై పోోరుకు చేయనున్న వ్యయం ఏకంగా 1500 కోట్ల రూపాయలకు చేరింది.

కరోనా బాధితులకు అవసరమైన శ్వాస సంబంధ పరికరాలు, కరోనా నిర్ధారణ కిట్స్, చికిత్స అందిస్తున్న డాక్టర్లు, కరోనాకు చికిత్స అందించే సౌకర్యాలు మెరుగుపర్చటానికి, హెల్త్ వర్కర్లకు ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలకు వెచ్చించనుంది. దేశంలోని ప్రముఖ పారిశ్రామిక సంస్థలు కరోనాపై పోరుకు ముందుకు వస్తున్నాయి. అయితే ఇప్పటివరకూ టాటాట్రస్ట్, టాటా సన్స్ ప్రకటించిన భారీ మొత్తంలో ఏ సంస్థ కూడా ప్రకటించకపోవటం విశేషం. కరోమా మహమ్మారి నుంచి గట్టెక్కేందుకు తక్షణ ఛర్యలు అవసరం అని రతన్ టాటా పేర్కొన్నారు.

 

Similar News