మరో సారి స్టాక్ మార్కెట్ విలవిల

Update: 2020-03-12 04:31 GMT

దేశీయ స్టాక్ మార్కెట్లో మరోసారి ఇన్వెస్టర్లు విలవిలలాడారు. కరోనా దెబ్బకు దేశీయ మార్కెట్లు ఇంకా కుదేలయ్యాయి. అంతర్జాతీయంగా పరిస్థితి కూడా అంతే ఉండటంతో గురువారం ప్రారంభం నుంచి మార్కెట్లు పతనం అవుతూనే ఉన్నాయి. గత పక్షం రోజుల్లోనే మార్కెట్లు ఏకంగా వెయ్యి పాయింట్లకు పైగా పతనాలు వరస పెట్టి చూడటం ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తోంది. అన్ని రంగాలకు చెందిన షేర్లు నష్టాల బాటలోనే పయనిస్తున్నాయి. పలు షేర్లు కొత్త రికార్డు కనిష్ట స్థాయిలకు చేరుతున్నాయి.

అయినా కూడా ఈ పతనం ఎక్కడ ఆగుతుందో ఎవరికీ అంతుచిక్కటం లేదు. దీంతో కొత్తగా పెట్టుబడి పెట్టేందుకు ఇన్వెస్టర్లు పెద్దగా ఆసక్తి చూపటం లేదు. గురువారం ఉదయం పది గంటల సమయంలో సెన్సెక్స్ ఏకంగా 1700 పాయింట్లకు పైగా నష్టాన్ని మూటకట్టుకుంది. నిఫ్టీ పరిస్థితి కూడా అంతే. అంతర్జాతీయ మార్కెట్లు కూడా కరోనా దెబ్బకు కకావికలం అవుతున్నాయి.

 

 

Similar News