ఆన్ లైన్ లో మద్యం సరఫరా

Update: 2020-03-31 10:03 GMT

దేశంలో అందరూ కరోనా కారణంతో టెన్షన్ టెన్షన్ తో గడుపుతుంటే వీళ్ళది ఓ ప్రత్యేక బాధ. నిత్యం మందు పడందే ఉండలేని వారు లాక్ డౌన్ తో నానా ఇబ్బందులు పడుతున్నారు. మద్యం దొరకని కారణంగా ఆత్మహత్యలకు దిగుతున్నారు. ఈ సంఖ్య కేరళలో ఎక్కువగా ఉంది. తెలంగాణలో కూడా మందు బాబుల ఆత్మహత్యలు నమోదు అవుతున్నాయి. మరికొంత మంది మందు ఎక్కడ దొరుకుతుందా అని ఆరాలు తీస్తూ కనీసం ఒక బాటిల్ అయినా ఇవ్వండి బాబూ అని వేడుకుంటున్నారు. కొంత మంది ప్రయత్నాలు ఫలిస్తున్నాయి..ఎక్కువ మందికి నిరాశే. కేరళలో పరిస్థితి అదుపు తప్పే సూచనలు కన్పిస్తుండటంతో ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ వెంటనే రంగంలోకి దిగారు. దీనిపై సమీక్ష జరిపి..వైద్యులు సిఫారసు చేస్తేనే మద్యం అమ్మేలా చూడాలన్నారు.

అది కూడా ఆన్ లైన్ లోనే ఈ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. దీని కోసం అధికారులు వెంటనే కసరత్తు ప్రారంభించారు. కరోనా వైరస్ బారిన పడకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ ఇంటిపట్టునే ఉండాలని...ఎవరూ బయటకు రావొద్దని సూచిస్తున్న విషయం తెలిసిందే. అందుకే కేరళలో ఆన్ లైన్ ద్వారా మందు సరఫరా చేయాలని యోచిస్తున్నారు. మద్యం దొరక్క సోమవారం ఒక్కనాడే కేరళలో తొమ్మిదిమంది మరణించారు. వీరిలో ఏడుగురు ఆత్మహత్యకు పాల్పడగా.. ఇద్దరు గుండెపోటుతో మృతిచెందారు.

 

 

Similar News