ఏపీలో ఇళ్ళ పట్టాల పంపీణీ వాయిదా

Update: 2020-03-20 14:16 GMT

ఏపీలో జగన్మోహన్ రెడ్డి సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఇళ్ళ పట్టాల పంపిణీ వాయిదా పడింది. తొలుత ఉగాది సందర్భంగా ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా తలపెట్టాలని నిర్ణయించారు. ఇళ్ళ పట్టాల పంపిణీకి ఎలాంటి ఇబ్బందిలేదని రాష్ట్ర ఎన్నికల కమిషన్ క్లారిటీ ఇచ్చిన తర్వాత దీన్ని వాయిదా వేయాలని నిర్ణయించారు. కరోనా కారణంగానే ఇళ్ల పట్టాల పంపిణీ ఏప్రిల్ 14కు వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అధికార యంత్రాంగం కరోనా వైరస్ నివారణ పనుల్లో ఉండటమే కారణమని చెబుతున్నారు.

అంబేద్కర్ జయంతి రోజున పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇళ్ల పట్టాల పంపిణీపై జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో నీలం సాహ్ని, ఉన్నతాధికారులు హాజరయ్యారు. జిల్లాల వారీగా ఇళ్లపట్టాలు పంపిణీలపై సమీక్షించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

 

 

 

Similar News