అమరావతి భూ గోల్ మాల్ పై సీబీ‘ఐ’

Update: 2020-03-23 12:54 GMT

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి ప్రాంతంలో చోటుచేసుకున్న అవకతవకలపై ఏపీ సర్కారు సీబీఐ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు హోం శాఖ ముఖ్యకార్యదర్శి కుమార్ విశ్వజీత్ జీవో 46 జారీ చేశారు. అధికార వైసీపీ ఏర్పాటు చేసిన మంత్రివర్గ సబ్ కమిటీ వెల్లడించిన నివేదికలోని అంశాలపై సీబీఐ విచారణ జరపనుంది. రాజధానిగా అమరావతిని ప్రకటించటం మొదలుకుని..ఆ ప్రాంతంలో సాగిన ఇన్ సైడర్ ట్రేడింగ్ వ్యవహారాలపై అధికార వైసీపీ అసెంబ్లీ సాక్షిగా కూడా పలు ఆరోపణలు చేసింది. అమరావతిలో ఇన్ సైడర్ ట్రిడింగ్ జరిగిందని..దీని ద్వారా అప్పటి అధికార టీడీపీ నేతలు భారీ ఎత్తున లబ్ది పొందారనే విమర్శలు ఉన్నాయి.

ఇఫ్పటికే అమరావతి భూ లావాదేవీలకు సంబంధించి కొన్ని కేసులు కూడా నమోదు అయ్యాయి. అమరావతి భూ లావాదేవీల అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు సాగిన సంగతి తెలిసిందే. ప్రతిపక్ష టీడీపి కూడా గతంలో అమరావతి భూ లావాదేవీలపై చేతనైతే సీబీఐ విచారణ జరిపించమని సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సర్కారు సీబీఐ విచారణకు నిర్ణయం తీసుకుని జీవో జారీ చేసింది.

Similar News