స్టాక్ మార్కెట్లో ఆగని పతనం..ట్రేడింగ్ కు బ్రేక్

Update: 2020-03-13 04:09 GMT

భారతీయ స్టాక్ మార్కెట్లో రక్తపాతం ఆగటం లేదు. శుక్రవారం నాడు ప్రారంభంలోనే సెన్సెక్స్ ఏకంగా 3000 పాయింట్ల వరకూ పతనం అయింది. దీంతో ట్రేడింగ్ ను నిలిపివేశారు. నిఫ్టీ 950 పాయింట్లు నష్టపోయింది. అన్ని షేర్లు నేలచూపులే తప్ప...ఒక్కటంటే ఒక్కటి కూడా పెరిగిన షేర్ లేదంటే అందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. దీంతో ప్రారంభం అయిన కొద్దిసేపటికే ట్రేడింగ్ కు 45 నిమిషాల పాటు విరామం ఇచ్చారు.

గురువారం నాడు ఒక్క రోజే 11 లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరిపోయింది. ఇందులో తరతమ భేదం లేకుండా అగ్రశ్రేణి కంపెనీలు మొదలుకుని అన్నీ షేర్లు పతనదిశగానే సాగాయి. ఈ వారానికి చివరి ట్రేడింగ్ రోజు అయిన శుక్రవారం క్లోజింగ్ నాటికి పరిస్థితి ఎలా ఉంటుందా? అన్న టెన్షన్ లో ఇన్వెస్టర్లు ఉన్నారు.

 

Similar News