క్యాట్ లో జగన్ సర్కారుకు ఎదురుదెబ్బ

Update: 2020-02-25 06:08 GMT

కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్)లో జగన్మోహన్ రెడ్డి సర్కారుకు ఎధురుదెబ్బ తగిలింది. చంద్రబాబు హయాంలో ఎకనమిక్ డెవలప్ బోర్డు (ఈడీబీ) సీఈవోగా వ్యవహరించిన జాస్తి కృష్ణ కిషోర్ ను జగన్మోహన్ రెడ్డి సర్కారు సస్పెండ్ చేయగా..క్యాట్ ఆ సస్పెన్షన్ ను ఎత్తేసింది. అయితే అవినీతి ఆరోపణలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తన విచారణతో ముందుకు సాగొచ్చని స్పష్టం చేసింది. సస్పెన్షన్ ఎత్తేయటంతో కృష్ణకిషోర్ ఇప్పుడు కేంద్ర సర్వీసులకు వెళ్ళేందుకు మార్గం సుగమం అయినట్లు అయింది. గత ప్రభుత్వంలో ఏపీ ఆర్థిక అభివృద్ధి మండలి సీఈవోగా పనిచేసిన కృష్ణ కిషోర్‌పై అవినీతి ఆరోపణలు రావడంతో జగన్ ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.

తనకు కొన్ని నెలల పాటు కావాలని జీతం ఆపేయటంతోపాటు..రిలీవ్ చేయకుండా ఆపేశారని కృష్ణకిషోర్ క్యాట్ ను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఆయన క్యాట్ కు వెళ్లిన తర్వాతే సర్కారు ఆయనకు ఇవ్వాల్సిన పెండింగ్ జీతాలు చెల్లించింది. ఈడీబీలో ఉండగా ఆయన కోట్లాది రూపాయల నిధులను దుర్వినియోగం చేశారని, నిబంధనలకు విరుద్ధంగా ప్రకటనలు జారీ చేసి సర్కారు ఖజానాకు కోట్ల రూపాయల మేర నష్టం చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. చంద్రబాబు హయాంలో దావోస్ సమావేశాలతోపాటు పలు అంతర్జాతీయ సమావేశాలకు అప్పటి సీఎం చంద్రబాబుతోపాటు టీమ్ లను తీసుకెళ్ళటంలో ఈడీబీనే కీలక పాత్ర పోషించింది.

 

 

Similar News