రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల

Update: 2020-02-25 04:24 GMT

ఏపీలో నాలుగు, తెలంగాణలో రెండు సీట్లకు ఎన్నికలు

తెలంగాణ, ఏపీలో ఇక రాజ్యసభ ఎన్నికల సందడి ప్రారంభం కానుంది. కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం నాడు రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా 17 రాష్ట్రాల్లో ఖాళీ కానున్న 55 సీట్లకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ 55 మంది రాజ్యసభ సభ్యుల పదవీ కాలం 2020 ఏప్రిల్ లో ముగియనుంది. ఖాళీ అయ్యే వాటిలో తెలంగాణ నుంచి రెండు సీట్లు ఉండగా, ఏపీ నుంచి నాలుగు సీట్లు ఉన్నాయి. తెలంగాణలో కెవీపీ రామచంద్రరావు, గరికపాటి మోహన్ రావుల పదవీ కాలం ముగియనుంది. ఏపీలో ఎం ఏ ఖాన్, తోట మహాలక్ష్మీ, సుబ్బరామిరెడ్డి, కె. కేశవరావుల పదవీ కాలం ముగియనుంది.

ఆయా రాష్ట్రాల్లో ఉన్న సంఖ్యాబలం చూస్తే తెలంగాణలో అధికార టీఆర్ఎస్, ఏపీలో అధికార వైసీపీ ఎన్నికలు లేకుండా సీట్లను కైవసం చేసుకోనుంది. రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్లు మార్చి6న జారీ కానున్నాయి. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ మార్చి13,2020గా నిర్ణయించారు. నామినేషన్ల స్క్రూటినీ మార్చి16న. ఎన్నికలు అవసరం అయిన చోట మాత్రం మార్చి 26న ఎన్నికలు జరుగుతాయి. రాజ్యసభ ఎన్నికలను మార్చి 30లోగా పూర్తి చేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.

Similar News