ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ వేటు

Update: 2020-02-09 04:12 GMT

ఏపీలో కీలక పరిణామం. సీనియర్ ఐపీఎస్ అధికారి, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు శనివారం రాత్రి ఉత్తర్వులు వెలువడ్డాయి. అంతే కాదు సర్కారు ఆయనపై తీవ్రమైన అభియోగాలు మోపుతోంది. విచారణ పూర్తయ్యేదాకా ఏ బీ వెంకటేశ్వరరావు హెడ్‌క్వార్టర్స్‌ వదిలి వెళ్లడానికి వీల్లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పేరిట శనివారం అర్ధరాత్రి జీవో (నంబరు 18) జారీ అయింది. క్రమశిక్షణ చర్యలు పెండింగ్‌లో ఉన్నందున.. అఖిల భారత సర్వీసు నిబంధనలు (1969)లోని 3(1) నిబంధన కింద ఆయన్ను సస్పెండ్‌ చేస్తున్నట్లు తెలిపారు.

అదనపు డీజీగా ఉన్న సమయంలో భద్రతా పరికరాల కొనుగోలులో ఆయన అడ్డగోలుగా వ్యవహరించారని ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు చేసింది. ప్రజాప్రయోజనాల దృష్ట్యా ఆయన్ను తక్షణమే సస్పెండ్‌ చేస్తున్నట్లు సీఎస్‌ పేర్కొన్నారు. ప్రభుత్వ అనుమతి లేకుండా హెడ్‌క్వార్టర్స్‌ వదిలి వెళ్లడానికి వీల్లేదని ఆదేశించారు. ప్రతిపక్షంలో ఉండగా వైసీపీ నేతలు ఏ బీ వెంకటేశ్వరరావుపై తీవ్ర ఆరోణలు చేసింది. వైసీపీ ఎమ్మెల్యేల ఫిరాయింపుల విషయంలో కూడా ఆయనే కీలక పాత్ర పోషించారని ఆరోపించింది. జగన్ సీఎం అయిన తర్వాత ఆయనకు ఇంత వరకూ ఎలాంటి పోస్టింగ్ కూడా లేదు.

 

Similar News