ఏపిలో ఆర్ధిక అత్యవసర పరిస్థితి విధించాలి

Update: 2020-01-05 11:06 GMT

తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు ఏపీ ఆర్థిక పరిస్థితిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ సర్కారు రాష్ట్రాన్ని ఆర్ధికంగా అధోగతి పాలు చేసిందని ఆరోపించారు. ఇఫ్పుడు కొత్తగా ఎవరూ అప్పులు ఇచ్చే పరిస్థితి కూడా లేదన్నారు. గత ఎనిమిది నెలల కాలంలో రాష్ట్రంలో ప్రగతి పడకేసిందని అన్నారు.ఆదాయం పడిపోవడమే కాకుండా రెవిన్యూ వ్యయం పెరిగింది. మూలధన వ్యయం రూ.10,486కోట్లు తగ్గింది. ఉద్యోగుల జీతాలు,పెన్షన్లు ఇవ్వడమే కనాకష్టం అయ్యింది.

సంక్షేమంపై వ్యయం రూ.2వేల కోట్లు తగ్గించేశారు.

పేదల సంక్షేమ పథకాలకు తూట్లు పొడిచారు. ఇలాగైతే భవిష్యత్తులో కూడా ఆదాయం పెరగదు. వచ్చే ఆదాయం అంతా జీతాలు, పెన్షన్లకే సరి..అభివృద్ది పనులకు, సంక్షేమానికి పైసా లేదు.తలసరి ఆదాయం రెండేళ్ల దిగువకు పడిపోయింది. ధరలు పెరిగాయి, కొనుగోలు శక్తి తగ్గింది, పొదుపుశక్తి పడిపోయింది. అటు రాష్ట్రాన్ని అధ:పాతాళంలోకి నెట్టారు. ఇటు పేదల నోటివద్ద ముద్ద నేలపాలు చేశారు. రివర్స్ టెండర్ల పేరుతో అభివృద్దిని రివర్స్ చేశారు, దానితో పేదల సంక్షేమం కూడా రివర్స్ అయిందని విమర్శించారు.

 

 

Similar News