రాజధానిపై పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Update: 2020-01-01 13:09 GMT

ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అమరావతిపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి రాజధానా? గ్రామమా అని ప్రశ్నించారు. రాజధాని సిద్ధం కావటానికి వందేళ్లు పడుతుందని వ్యాఖ్యానించారు. రాయలసీమ ముఖ్యమంత్రులు అందరూ హైదరాబాద్ నే అభివృద్ధి చేశారని అన్నారు. రాయలసీమకూ విశాఖపట్నంకు చాలా దూరం ఉన్నా రాజధానిలో పని కేవలం పది శాతం మందికి మాత్రమే ఉంటుందని అన్నారు. కర్నూలులో హైకోర్టు వస్తుందని తెలిపారు. హైకోర్టులోనూ రాష్ట్ర ప్రజల్లో కేవలం పది శాతం మందికి మాత్రమే పని ఉంటుందని తెలిపారు.

రాయలసీమ ప్రాంత ప్రజలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ణతలు తెలపాన్నారు. అసెంబ్లీలో చర్చించిన తర్వాత రాజధానిపై అధికారిక ప్రకటన వస్తుందని తెలిపారు. మూడు రాజధానుల ఆలోచన చాలా మంచిదని అన్నారు. రాజధానిపై ఆయా కమిటీలు ఇచ్చిన నివేదికలను అసెంబ్లీ ముందు పెడతామని తెలిపారు. అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వాళ్ళే రాజధాని తరలింపుపై ఆందోళన చేస్తున్నారని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు..

 

Similar News