తెలంగాణ మునిసిపోల్స్ కు లైన్ క్లియర్

Update: 2020-01-07 15:36 GMT

హైకోర్టు తేల్చేసింది. తెలంగాణ మునిసిపల్ ఎన్నికలకు లైన్ క్లియర్ అయింది. రిజర్వేషన్లు ఖరారు చేయకుండా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయటం నిబంధనలకు విరుద్ధం అంటూ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టివేసింది. ఉత్తమ్ పిటీషన్ తోపాటు ఈ ఎన్నికలకు సంబంధించి ధాఖలైన పిటీషన్లు అన్నింటిని హైకోర్టు కొట్టివేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది.

దీంతో యథావిధిగా రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికలు జరుగనున్నాయి. హైకోర్టు తీర్పుతో రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం సాయంత్రం ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసింది. 120 మునిసిపాలిటీలకు, తొమ్మిది కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. జనవరి 22న ఎన్నికలు జరగనుండగా..జనవరి 25న ఓట్ల లెక్కింపు పూర్తి కానుంది. నామినేషన్ల స్వీకరణకు తుది గడువు జనవరి 10వ తేదీనే.

 

Similar News