జనసేన, బిజెపి ‘లాంగ్ మార్చ్’ వాయిదా

Update: 2020-01-25 10:02 GMT

అమరావతి రైతులకు మద్దతుగా జనసేన, బిజెపిలు ఫిబ్రవరి 2న సంయుక్తంగా తలపెట్టిన లాంగ్ మార్చ్ వాయిదా పడింది. ఈ కార్యక్రమం ఎప్పుడు ఉండేది తర్వాత ప్రకటించనున్నారు. లాంగ్ మార్చ్ వాయిదా విషయాన్ని బీజేపీ నేత నాగభూషణం ప్రకటించారు. త్వరలో ఇరు పార్టీల కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన తెలిపారు. ఇటీవల ఢిల్లీలో కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌ను ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను కలిశారు.

ఈ సందర్భంగా ఇకపై అన్ని కార్యక్రమాలు జనసేన- బీజేపీ కలిసే చేస్తాయని బీజేపీ నేత కన్నా లక్ష్మినారాయణ ప్రకటించారు. రాజధాని విషయంలో రైతులకు అండగా ఉండటానికి.. బీజేపీ- జనసేన కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాయని జనసేన నేత నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఫిబ్రవరి 2వ తేదీన తాడేపల్లి నుంచి విజయవాడ వరకు లాంగ్‌ మార్చ్‌ నిర్వహిస్తామని, రాష్ట్ర ప్రజలకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని మనోహర్ తెలిపారు. అయితే ఈ కార్యక్రమం వాయిదా కారణాలేంటి అనేది తెలియాల్సి ఉంది.

 

 

Similar News