జనవరి 16న బిజెపి, జనసేన నేతల భేటీ

Update: 2020-01-14 13:34 GMT

ఏపీ రాజకీయాల్లో కొత్త పొత్తులు పొడవనున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన తర్వాత పరిణామాలు వేగంగా సాగుతున్నాయి. జనవరి 16న విజయవాడలో జనసేన, బిజెపి నేతలు సమావేశం కానున్నారు. ఈ విషయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆ పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ లు వెల్లడించారు. త్వరలో జరగనున్న ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రెండు పార్టీల పొత్తుల వ్యవహారం కీలకంగా మారనుంది. తన ఢిల్లీ పర్యటనలో రాష్ట్రంలో పెట్టుబడులు వెనక్కిపోవటం, అమరావతి అంశం, ఆడపడుచులపై దాడుల అంశాన్ని ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్ళినట్లు పవన్ కళ్యాణ్ మీడియా సమావేశంలో ఓ ప్రశ్రకు సమాధానంగా తెలిపారు. బిజెపితో గత కొన్ని రోజులుగా చర్చలు జరుగుతున్నాయని... పిలుపురాగానే వెళ్లి పలు విషయాలు తెలియజేశామన్నారు. ఏపీ విషయంలో అందరికీ ఆమోదయోగ్య నిర్ణయం తీసుకోవాలి. భవిష్యత్ లో ఎలా ఉండాలి. ఏ ఆశయాలతో అయితే ప్రధాని ముందుకెళుతున్నరో..ఏపీలో మాత్రం అలా లేదు.

రాష్ట్రానికి బలమైన సహాయ, సహకారాలు కావాలని ప్రత్యేకంగా చెప్పాను. అధికార వికేంద్రీకరణ గురించి వైసీపీకి నిజంగా చిత్తశుద్ధి ఉండి ఉంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఆ మాట చెప్పి ఉండాల్సింది అన్నారు. విశాఖపట్నం రాజధాని ప్రజలు కోరుకున్నది కాదని..వైసీపీ నేతలు కోరుకున్నది అని వ్యాఖ్యానించారు. అయినా రాజధాని ఎన్నిసార్లు మారుస్తారని పవన్ ప్రశ్నించారు. ఎంత ప్రజధనం దుర్వినియోగం చేస్తారని ప్రశ్నించారు. గతంలో ఉద్యోగులు ఐదురోజుల పనిదినాలు కావాలంటే ఇచ్చేశారు..వాళ్ళ కోసం ప్రత్యేక రైళ్ళు వేశారు. ఇప్పుడు మళ్ళీ మారిస్తే కుటుంబాల తరలింపు..దానిపై పడే ఆర్ధిక భారం ఎవరు భరిస్తారు. ఇదంతా ప్రజల డబ్బు దుర్వినియోం చేయటం కాదా? అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.

 

 

Similar News