వైసీపీది ‘రంగుల రాజ్యం’

Update: 2019-12-02 11:28 GMT

జనసేన అధినేత వవన్ కళ్యాణ్ అధికార వైసీపీపై ఫుల్ ఎటాక్ మోడ్ లో ఉన్నారు. ఆయన సోమవారం నాడు తిరుపతిలో పార్టీ నేతలతో మాట్లాడుతూ వైసీపీ సర్కారు ‘రంగుల రాజ్యం’గా మారిందని ఎద్దేవా చేశారు. తిరుమల కొండలకు తప్ప అన్ని చోట్ల వైసీపీ రంగులు వేశారని విమర్శించారు. ఆడబిడ్దల ప్రాణాలు రక్షించకపోతే 151 సీట్లు వచ్చి ఏమి ఉపయోగం అని ప్రశ్నించారు. రేపిస్టులను తాటతీసేలా చర్యలు ఉండాలన్నారు. మీకు అనుకూలంగా ఉన్న పనులు మాత్రం మీరు చేసుకోండి. లేకపోతే వ్యతిరేకంగా చేస్తారు. మీకు తెలుగుదేశం అమరావతి కట్టకూడదు..కూల్చేశారు. ఆ పార్టీ చేసిన వాటన్నింటికి వ్యతిరేకంగా ముందుకెళతారు. రాయలసీమ ప్రాంతం నుంచి ఎంతో మంది ముఖ్యమంత్రులు పనిచేసినా ఈ ప్రాంతం ఇంకా వెనకబాటులోనే ఉందని అన్నారు.

రాయలసీమలో రైతులకు కనీసం శీతల గిడ్డంగులు కూడా కట్టలేకపోయారని విమర్శించారు. జనసేన గుండె బలానికి వైసీపీ భయపడుతుందని వ్యాఖ్యానించారు. తాను రాజకీయాల్లోకి వచ్చింది సిమెంట్ పరిశ్రమలు పెట్టుకోవటానికి కాదన్నారు. రాయలసీమలో నేతల పొలాలు మాత్రం పచ్చగా ఉంటాయని..మిగిలిన వాళ్ళు మాత్రం కూలీ పనుల కోసం వలస వెళ్ళాల్సిన దుస్థితి ఉందని తెలిపారు. ఓట్ల రాజకీయాలు చేయని రోజు, రైతులను ఇబ్బంది పెట్టని రోజే తాను సీఎంను గౌరవిస్తానని..అప్పటివరకూ జగన్ రెడ్డి అనే పిలుస్తానని మరో తెలిపారు.

Similar News