ఈనాడులో ‘బిగ్ వికౌట్ డౌన్’

Update: 2019-12-18 05:52 GMT

తెలుగు రాష్ట్రాల్లో అగ్రస్థానంలో ఉన్న పత్రిక ఈనాడు. ఈనాడులో తాజాగా జరిగిన పరిణామాలతో ఆ పత్రికలో ఓ బిగ్ వికెట్ పడిపోయింది.కొంత కాలం క్రితం వరకూ ఈనాడులో కీలక పొజిషన్ లో ఉన్న రాహుల్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఇటీవల వరకూ ఆయన ఈనాడులో అత్యంత కీలకమైన సెంట్రల్ డెస్క్ బాధ్యతలు చూసుకునేవారు. కారణాలు ఏంటో కానీ ఆయన్ను పక్కకు తప్పించి ఈ బాధ్యతలు మరో సీనియర్ నాగేశ్వరరావుకు అప్పగించారు. తాజాగా జరిగిన మార్పుల్లో ఈనాడు వ్యవస్థాపకుడు రామోజీరావు చీఫ్ ఎడిటర్ బాధ్యతల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.

అదే సమయంలో నాగేశ్వరరావును ఏపీ ఎడిటర్ గా, డీఎన్ ప్రసాద్ ను తెలంగాణ ఎడిషన్ ఎడిటర్ లుగా నియమిస్తూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. దీంతో తీవ్ర మనస్థాపానాకి గురైన రాహుల్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. కీలకమైన సెంట్రల్ డెస్క్ బాధ్యతల నుంచి తప్పించటం ఒక అవమానం అయితే..తాజాగా జరిగిన మార్పుల్లో తనకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకపోవటంతో ఆయన తనకు కావాలనే పొగ పెడుతున్నారనే భావనతో రాజీనామా చేసినట్లు ఆ సంస్థ ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. రాహుల్ మంగళవారం నాడు తన రాజీనామా లేఖ అందజేసినట్లు సమాచారం.

 

Similar News