‘దిశ’ ఎన్ కౌంటర్ పై ఈటెల సంచలన వ్యాఖ్యలు

Update: 2019-12-14 15:47 GMT

తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్ కౌంటర్లు, ఉరిశిక్షలతో సమస్య పరిష్కారం కాదన్నారు. ఇవి తాత్కాలిక పరిష్కారాలు మాత్రమే అని పేర్కొన్నారు. ఇలాంటి సంఘటనలు జరక్కుండా ఉండాలంటే సమాజంలో మార్పు రావాలని ఈటెల వ్యాఖ్యానించారు. అంబేద్కర్ కన్న కలలు నెరవేరాలన్నారు. టెక్నాలజీ మానవ కళ్యాణం కోసం ఉపయోగ పడాలి కానీ..అదే జీవితాన్ని విధ్వంసం చేస్తుందని మనిషి ఊహించలేదన్నారు. కంచె చేను మేసినట్లుగా తన పిల్లలపై తండ్రులు క్రూరమృగాలుగా ప్రవర్తిస్తున్నారని విచారం వ్యక్తం చేశారు ఈటెల. సెల్ ఫోన్లు, టీవీలు మానవకళ్యాణానికే ఉపయోగపడాలి. కానీ అవి విధ్వంసాలు సృష్టిస్తున్నాయి.

పిల్లల భవిష్యత్ పట్ల తల్లిదండ్రులకు భయం వేస్తోంది. బయటకు వెళ్లిన వారు క్షేమంగా వస్తారో లేదో నన్న భయం వారిని వెంటాడుతోంది. మానవ సంబంధాలు నాశనం అయ్యాయని అన్నారు. దేశ వ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించిన దిశ రేప్, హత్యకు కారణమైన నలుగురు నిందితులు పోలీస్ ఎన్ కౌంటర్ లో మరణించిన సంఘటన తెలిసిందే. ఈ ఎన్ కౌంటర్ పై ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇఫ్పటికే రెండుసార్లు తెలంగాణ సీఎం కెసీఆర్, తెలంగాణ పోలీసులు హ్యాట్సాప్ అని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. ఈ ఎన్ కౌంటర్ ను ఏ మాత్రం తప్పుపట్టకూడదన్నట్లు జగన్ స్పందించారు. అయితే తెలంగాణకు చెందిన మంత్రి ఈటెల దీనికి పూర్తి భిన్నమైన అభిప్రాయం వ్యక్తం చేయటం విశేషం.

 

Similar News