జగన్ సమస్యల్లేకుండా పరిపాలిస్తే..మేం బయటికే రాం

Update: 2019-11-04 13:34 GMT

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా పరిపాలిస్తే తాము బయటకు రావాల్సిన అవసరమే ఉండదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. తాము ప్రభుత్వం నుంచి మంచి పరిపాలనే కోరుకుంటున్నామని..భవన నిర్మాణ కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకే ‘లాంగ్ మార్చ్’ నిర్వహించామన్నారు. జగన్‌పై కానీ, ఇతర వైసీపీ నేతలతో తనకు వ్యక్తిగత ద్వేషాలు ఏమీ లేవని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. గత ప్రభుత్వం తప్పులు చేస్తే సరిచేయాలన్నారు. నిర్మాణ రంగాన్ని ఆపేస్తే అభివృద్ధి ఎలా సాధ్యం? అని ప్రశ్నించారు. ప్రభుత్వం సమస్యను వినకపోగా...నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ సోమవారం నాడు విశాఖపట్నంలో పార్టీ నేతల నాదెండ్ల మనోహర్, లక్ష్మీనారాయణలతో కలసి మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం సమస్యలను గుర్తించకపోవటం వల్లే తాము రోడ్డెక్కాల్సి వచ్చిందని తెలిపారరు. వైసీపీ నేతలు దిగజారి వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని అన్నారు.ప్రభుత్వ విధానాల్లో తప్పులుంటే ఖచ్చితంగా ప్రశ్నిస్తామన్నారు.

మమ్మల్ని తిడితే... భవన నిర్మాణ కార్మికులు సమస్యలు తీరతాయా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ విధానాల్లో తప్పులుంటే నిలదీస్తామని చెప్పారు. ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు రూ.5లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వరదల వల్ల ఇసుక కొరత వచ్చిందనడం సరికాదన్నారు. కర్ణాటక, మహారాష్ట్రలో వర్షాలు, వరదలు వచ్చాయి..అక్కడ ఎందుకు భవన నిర్మాణ కార్మికులు చనిపోలేదని ప్రశ్నించారు. కోరి తెచ్చుకున్న సీఎస్‌ ఎల్వీ సుబమణ్యంను తప్పించారంటే..ఏవో తప్పులు జరిగినట్లే అర్థమవుతోందన్నారు. జనసేన లాంగ్‌మార్చ్‌ కు మంచి స్పందన వచ్చిందని వాఖ్యానించారు. సినిమాల్లో చేస్తానో లేదో తనకే తెలియదని మీడియా ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు. అయితే నిర్మాతగా మాత్రం వ్యవహరిస్తానని తెలిపారు.

 

 

Similar News