టీడీపీకి షాక్..వల్లభనేని వంశీ రాజీనామా

Update: 2019-10-27 10:39 GMT

ఊహించిందే జరిగింది. తెలుగుదేశం పార్టీకి కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గుడ్ బై చెప్పారు. టీడీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎమ్మెల్యే పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు. ఈ మేరకు చంద్రబాబుకు లేఖ పంపారు. అంతే కాదు వంశీ ఏకంగా రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. వైసీపీ నేతలు..కొంత మంది అధికారుల వల్ల క్యాడర్ ఇబ్బంది పడుతుందని వంశీ తన లేఖలో పేర్కొన్నారు. రాజకీయాల నుంచి తప్పుకునే వారైతే వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డిని మంత్రులతో వెళ్ళి కలవాల్సిన అవసరం ఏముందనేది టీడీపీ నేతల వాదన.

ఇదిలా ఉంటే వల్లభనేని వంశీ వైసీపీలో చేరతారని ప్రచారం జరుగుతుండటంతో గన్నవరం వైసీపీ నియోజకవర్గ ఇన్ ఛార్జి యార్లగడ్డ వెంకట్రావు కూడా తన అనుచరులతో సమావేశం అయ్యారు. ఆయన వంశీ వైసీపీలో రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సోమవారం నాడు యార్లగడ్డ వెంకట్రావు సోమవారం నాడు జగన్ తో భేటీ ఈ అంశాన్ని ప్రస్తావించాలని నిర్ణయించుకున్నారు. రాజకీయాల నుంచి వైదొలగనున్నట్లు వంశీ చేసిన ప్రకటనకు కట్టుబడి ఉంటారా? తర్వాత ఏమైనా అందులో ఏమైనా మార్పులు ఉంటాయా అన్నది వేచిచూడాల్సిందే.

Similar News