గోపాల్ దాస్ వరమ్ చంద్ రాందీ

Update: 2019-10-02 16:03 GMT

గోపాల్ దాస్ కరమ్ చంద్ గాందీ. దేశంలో అందరికీ తెలిసిన పేరు ఇది. అక్టోబర్ 2న గాందీ పుట్టిన రోజు కావటంతో దేశంలోని వివిఐపిలు అందరూ బుధవారం నాడు ఆయన సేవలు స్మరించుకున్నారు. కానీ ఈ అకేషన్ ను కూడా వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో ఉపయోగించుకున్నారు. తనకు తాను తన పేరును గోపాల్ దాస్ వరమ్ చంద్ రాందీ అని ప్రకటించటంతోపాటు..హ్యాపీ మై జయంతీ అంటూ ట్వీట్ చేశారు. గాంధీ పోటోతో తన ఫోటోను మిక్సింగ్..మార్ఫింగ్ చేసి మరో కొత్త వివాదానికి తెరతీశాడు. అంతే కాదు ఈ ఫోటోలను ట్విట్టర్ లో షేర్ చేశాడు.

‘బ్రిటిష్‌ పాలనలో భారతీయుల బానిసత్వం పోవడానికి పోరాడి భారతీయ పాలన రాబట్టి స్వాతంత్రం తెచ్చిపెట్టారు అలనాటి గాంధీ. సమరయోధులు కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే స్త్రీ బానిసత్వం పోవడానికి, వాళ్ల విలువల కోసం నిరంతరం కృషి చేస్తున్నవాడు ఒక్క రామ్‌గోపాల్‌ వర్మ మాత్రమే’ అని పేర్కొన్నాడు. అంతే కాదు... తన పేరును ‘గోపాల్‌దాస్‌ వరంచంద్‌ రాంధీ’ చెబుతూ వర్మ మరో ట్వీట్‌ చేశాడు.

 

 

Similar News