‘బంగారం’ వార్తలు కరెక్ట్ కాదు

Update: 2019-10-31 14:42 GMT

భారీ ఎత్తున బంగారం నిల్వలు గల వారికి నల్లధనం వెల్లడి తరహాలో క్షమాభిక్ష పథకం తేనున్నట్లు జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదని కేంద్రం ప్రకటించింది. బడ్జెట్ ముందు ఇలాంటి ప్రచారాలు సహజమే అని..కేంద్రం వద్ద అలాంటి ప్రతిపాదన ఏదీలేదని కొట్టిపారేశారు. వ్యక్తులు తమ వద్ద ఉన్న బంగారం నిల్వలను స్వచ్ఛందంగా ప్రకటించే ఆమ్నెస్టీ స్కీమ్‌ వంటిదేమీ తమ ప్రతిపాదనలో లేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.

బంగారంపై నియంత్రణలు విధిస్తూ పరిమితికి మించిన బంగారం ఉంటే స్వచ్ఛందంగా వెల్లడించే పథకం త్వరలో ఖరారు కానుందని, గోల్డ్‌ బోర్డ్‌ ఏర్పాటవుతుందని దేశ వ్యాప్తంగా మీడియాలోనూ..సోషల్ మీడియాలో భారీ ఎత్తున ప్రచారం సాగింది. రసీదులు లేకుండా కొనుగోలు చేసిన బంగారం విలువ మొత్తంపై పన్ను విధింపుపై కూడా కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని వార్తలు వచ్చాయి. కేంద్రం తాజా వివరణతో ప్రస్తుతానికి ఎవరికీ బంగారం టెన్షన్ లేనట్లే.

 

Similar News