జగమే మాయ..బతుకే బట్టలు సర్దుకుని పోయే
ఈ డైలాగ్ ఎక్కడిది అనుకుంటున్నారా?. ఫోన్ చుట్టూనే తిరుగుతున్నట్లు ఉంది ఆ సినిమా స్టోరీ. టీజర్ తోనే ఆకట్టుకున్న ఈ సినిమా..ట్రైలర్ తో ప్రేక్షకుల్లో మరింత ఉత్కంఠను రేపుతోంది. ఈ సినిమాకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి కూడా. హీరో నిర్మాతగా మారాడు. దర్శకుడు హీరోగా మారాడు. అదే ‘మీకు మాత్రమే చెప్తా’. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ సూపర్ స్టార్ మహేష్ బాబు బుధవారం సాయంత్రం రిలీజ్ చేశారు. ట్రైలర్ చాలా ఆసక్తికరంగా..ముఖ్యంగా యూత్ ను ఆకట్టుకునేలా ఉంది.
ఇందులో అంతా ఫోన్ వాడకం..వీడియోలు చూడటం వంటి అంశాలనే ప్రస్తావించారు. అదే సమయంలో ‘ప్రతి ఫోన్ లో కన్ఫామ్ గా ఓ సీక్రెట్ ఉంటుంది అంటూ ఆసక్తిరేపే డైలాగ్ లు జోడించారు. ఈ సినిమాలో పెళ్ళిచూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్ తొలిసారి హీరోగా దర్శనం ఇవ్వబోతున్నాడు. మనలైఫ్ మనచేతిలో ఉందో లేదో లేదో కానీ..మన ఫోన్ మాత్రం మన చేతిలో ఉంది అంటూ ట్రైలర్ ప్రారంభం అవుతుంది.
https://www.youtube.com/watch?v=YoL7AEf7erQ