టాలీవుడ్ తో పాటు ఏ సినీ పరిశ్రమలో అయినా విజయాలు ఉన్న వాళ్ళ వెంట మాత్రమే పడతారు. అది హీరో లు అయినా...డైరెక్టర్ల కు అయినా ఛాన్సులు దక్కాలంటే ఫస్ట్ కొలమానం సక్సెస్ మాత్రమే. వరస ప్లాప్స్ ఉంటే గత విజయాలను కూడా ఎవరూ పట్టించుకోరు . హీరో నితిన్ గత కొంతకాలంగా వరస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్నాడు. గత ఏడాది రిలీజ్ అయిన ఈ హీరో రెండు సినిమాలు రాబిన్ హుడ్, తమ్ముడు బాక్స్ ఆఫీస్ వద్ద దారుణ ఫలితాన్ని చవిచూశాయి. దీంతో ఫస్ట్ నితిన్ తో తెరకెక్కించాలని నిర్ణయించిన ఎల్లమ్మ సినిమా ఛాన్స్ కూడా చేజారిపోయింది. దర్శకుడు వేణు...దిల్ రాజు నిర్మాత గా ఈ మూవీ ని తెరకెక్కించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా ఛాన్స్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కు దక్కింది.
దీంతో నితిన్ కు ఇప్పటిలో సినిమా ఛాన్సులు వస్తాయా లేదా అన్న చర్చ సాగుతున్న వేళ నితిన్ నుంచి కొత్త సినిమా ప్రకటన వచ్చింది.