నాలుగు రోజుల్లో 82 కోట్లు

Update: 2026-01-18 07:10 GMT

సంక్రాంతి బరిలో నిలిచి మంచి హిట్ టాక్ తెచ్చుకున్న సినిమా అనగనగ ఒక రాజు. ఎప్పుడూ లేని రీతిలో ఈ సారి ఏకంగా బాక్స్ ఆఫీస్ ఏకంగా ఐదు సినిమాలు పోటీ పడినా కూడా నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటించిన అనగనగా ఒక రాజు మూవీ కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో కామెడీ తో పాటు క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాలు కూడా బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 82 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ ఆదివారం నాడు కూడా బుకింగ్స్ బాగానే ఉండటంతో ఈ సినిమా త్వరలోనే వంద కోట్ల రూపాయల క్లబ్ లో చేరటం ఖాయం అని చెప్పొచ్చు.

                                        Full Viewఅదే సమయంలో ఇది నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన తొలి వంద కోట్ల రూపాయల వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు నమోదు చేయటం ఖాయంగా కనిపిస్తోంది. సంక్రాంతి రారాజు బాక్స్ ఆఫీస్ ధమాకా పేలుతూనే ఉంటుంది అంటూ చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ వసూళ్ల పోస్టర్ ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. విడుదలకు ముందు నుంచే ఈ సినిమా పై మంచి బజ్ క్రియేట్ అయింది. దీనికి ప్రధాన కారణం నవీన్ పోలిశెట్టి నిర్వహించిన ప్రమోషన్స్ అని చెప్పొచ్చు.

Tags:    

Similar News