చిరు కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన మూవీ

Update: 2026-01-25 16:23 GMT

Full Viewతెరకెక్కించిన ప్రతి సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ గా మారుస్తున్న దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. ఇప్పటి వరకు ఆయన తీసిన తొమ్మిది సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్ గా నిలిచినవే. ముఖ్యంగా గత ఏడాది సంక్రాంతికి వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ పాటు...ఈ ఏడాదికి సంక్రాంతికి వచ్చిన మన శంకర వరప్రసాద్ గారు మూవీ లు అయితే వరసగా మూడు వందల కోట్ల రూపాయల పైగా గ్రాస్ వసూళ్లు సాధించి రికార్డు లు నమోదు చేశాయి. టాలీవుడ్ లో సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో అత్యధిక వసూళ్లు నమోదు చేసిన మూవీ కూడా చిరంజీవి, నయనతార జంటగా నటించిన మన శంకర వరప్రసాద్ గారు మూవీనే. దీంతో హీరో చిరంజీవి తో పాటు చిత్ర యూనిట్ అంతా ఫుల్ ఖుషిగా ఉంది.

                                     తన కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాను అందించిన దర్శకుడు అనిల్ రావిపూడికి చిరంజీవి తాజాగా ఒక ఖరీదు అయిన కారు ను బహుకరించారు. అల్ట్రా ప్రీమియర్ రేంజ్ రోవర్ కారు ఇప్పుడు అనిల్ రావిపూడి సొంతం అయింది. ఈ కారు బహుకరించే సందర్భంగా ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. కారు నచ్చిందా అని చిరంజీవి దర్శకుడు అనిల్ రావిపూడిని అడగ్గా...మెగా బహుమతి మహదానందం మనోధైర్యం ధనాధన్ అంటూ అనిల్ రావిపూడి సందడి చేశారు. దర్శకుడు అనిల్ రావిపూడికి...చిరంజీవి కారు గిఫ్ట్ గా ఇచ్చిన ఫోటో లు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. గత కొంత కాలంగా టాలీవుడ్ లో విజయవంతం అయిన సినిమా దర్శకులు...మ్యూజిక్ డైరెక్టర్లకు కూడా ఖరీదు బహుమతులు అందచేయటం ఒక ట్రెండ్ గా మారింది.

Tags:    

Similar News