ఫస్ట్ వంద కోట్ల మూవీ

Update: 2026-01-19 13:39 GMT

యువ హీరో నవీన్ పోలిశెట్టి టాలీవుడ్ లో తన తొలి వంద కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్ల రికార్డు ను నమోదు చేశాడు. ఈ హీరో నటించిన జాతి రత్నాలు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నా కూడా వంద కోట్ల రూపాయల క్లబ్ లో చేరలేదు. ఈ సంక్రాంతి బరిలో నిలిచిన అనగనగ ఒక రాజు మూవీ విడుదల అయిన ఐదు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా వంద కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ అధికారికంగా వెల్లడించింది. అనగనగ ఒక రాజు మూవీ జనవరి 14 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సంక్రాంతి సీజన్ లో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ తీవ్రంగా ఉన్నా కూడా ఒక వెరైటీ కథతో ప్రేక్షకులకు ఈ మూవీ చేరువ అయింది.

                                  Full Viewనవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి...నరేష్ ఇతర నటీ నటులు అంతా తమ తమ పాత్రలకు న్యాయం చేయటంతో ఈ మూవీ సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. అనగనగ ఒక రాజు మూవీ వంద కోట్ల రూపాయల క్లబ్ లో చేరటంపై ట్విట్టర్ వేదికగా నవీన్ పోలిశెట్టి స్పందించాడు. ఈ క్షణం కోసం ఎన్నో సంవత్సరాలు ఎదురు చూశానని..ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ విజయంతో తన హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది అన్నారు. తనను నమ్మి టికెట్ కొన్నందుకు థాంక్స్ అంటూ...ఈ బ్లాక్ బస్టర్ అందించిన నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రేక్షకులకు మరింత వినోదాత్మక సినిమాలు అందించేందుకు మరింత కష్టపడతా అని తన ట్వీట్ లో పేర్కొన్నారు.

Tags:    

Similar News