టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరైన అల్లు అర్జున్ మన శంకరవరప్రసాద్ గారు మూవీ విజయంపై స్పందించారు. ఈ మేరకు ఆయన ఒక ట్వీట్ చేశారు. చిరంజీవి, నయనతారల కాంబినేషన్ లో దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ మూవీ ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది దూసుకెళుతోంది. ఈ సినిమాకు రెండు తెలుగు రాష్టాల్లోనే కాకుండా..ఉత్తర అమెరికా లో కూడా కలెక్షన్స్ భారీగానే వస్తున్నాయి. నార్త్ అమెరికా లో ఈ మూవీ చిరంజీవి కెరీర్ లోనే అత్యధికంగా మూడు మిలియన్ల అమెరికా డాలర్లు వసూళ్లు చేసింది. ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రంతో బాస్ ఈజ్ బ్యాక్.. ఈ సినిమాతో చిరంజీవి థియేటర్లలో సందడి చేయడం చాలా సంతోషంగా ఉంది. వింటేజ్ వైబ్స్ తో వెండి తెర వెలిగిపోయింది.
వెంకీ గౌడ పాత్రలో వెంకీ మామ ఇరగదీశాడు.. నయనతార, కేథరిన్ థ్రెసా తమదైన పర్ఫార్మెన్స్‌లతో మెప్పించారని.. ప్రతి పాట వినసొంపుగా ఉందని.. ఇక అనిల్ రావిపూడి ప్రతి సంక్రాంతికి వస్తారు.. హిట్టు కొడతారు.. రిపీటు.. అంటూ అల్లు అర్జున్ ఈ సినిమాపై పొగడ్తల వర్షం కురిపించారు. అంతే కాదు..ఇది సంక్రాంతి బ్లాక్ బస్టర్ కాదు...సంక్రాంతి బాస్ బస్టర్ అంటూ పేర్కొన్నారు. అల్లు అర్జున్ ట్వీట్ పై నిర్మాత సాహు గారపాటి స్పందిస్తూ ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని చెపుతూ పోస్ట్ పెట్టినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇది తమకెంతో ఆనందంగా ఉందన్నారు. మరో వైపు ఈ సినిమా చిరంజీవి కూడా మన శంకర వరప్రసాద్ గారు విజయం పై ఆనందం వ్యక్తం చేస్తూ ప్రేక్షకులకు ఒక లేఖ రాశారు. ఇది అంతా కూడా తన ప్రాణ సమానులయిన అభిమానులది అన్నారు. ఈ బ్లాక్ బస్టర్ విజయం వెనక దర్శకుడు అనిల్ రావిపూడి ...నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత కొణిదెల కృషి ఎంతో అన్నారు. ఈ సంబరాన్ని ఇలాగే కొనసాగిద్దాం అని తన లేఖలో చిరంజీవి ప్రస్తావించారు.